🦅 EAGLE సెల్ – అన్నమయ్య జిల్లా
📅 తేదీ: 14-10-2026
📍 జిల్లా : అన్నమయ్య
🏢 సబ్ డివిజన్ : రాయచోటి
👮 పోలీస్ స్టేషన్ : రాయచోటి టౌన్
📌 స్థలం : గంగోత్రి మెడికల్, కొత్తపేట &amp కిషోర్ మెడికల్స్, రాజులకోలోని, రాయచోటి టౌన్
🚨 ఆపరేషన్ గరుడ – ఆకస్మిక తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు EAGLE సెల్ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా రాయచోటి పట్టణంలోని గంగోత్రి మెడికల్ షాప్ మరియు కిషోర్ మెడికల్స్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
🔍 తనిఖీల సందర్భంగా NRx మందులు మరియు మత్తు ప్రభావం కలిగించే Tramadol, Alprazolam, Clonazepam, Ultra Cet, Spasmo Proxyvon Plus తదితర ఔషధాల కొనుగోలు, నిల్వ, విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
💊 వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా NRx మందులను విక్రయించరాదని, ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే మందులను విక్రయించి, సంబంధిత రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ సూచించారు.
📋 అదేవిధంగా మెడికల్ షాప్ లైసెన్సులు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు మరియు ఇతర సంబంధిత రికార్డులను పరిశీలించి, Drugs and Cosmetics Act నిబంధనలపై షాప్ నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
👮♂️ ఈ తనిఖీలలో రాయచోటి డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి సంధ్య గారు, EAGLE సెల్ ప్రతినిధులు మరియు మెడికల్ షాప్ సిబ్బంది పాల్గొన్నారు.