ఆపరేషన్ గరుడలో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ గారు, పలాస పోలీస్ స్టేషన్ సిబ్బంది , ఈగల్ టీం ఆధ్వర్యంలో పలాస కాశీబుగ్గ పట్టణం పరిధిలో గల శ్రీ వెంకట సాయి మెడికల్ ఏజెన్సీ, శ్రీ శ్రీనివాస్ మెడికల్, అపోలో మెడికల్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది.
దీనిలో భాగంగా హెచ్ వన్ రిజిస్టర్ తనిఖీ చేయడం, NRX మందుల అమ్మకాలు, కొనుగోలు యొక్క బిల్లును పరిశీలించడం, సంబంధిత మెడికల్ షాపు సిబ్బందికి వీటి దుర్వినియోగం గురించి అవగాహన కలిగించడం జరిగింది