🦅 EAGLE సెల్ – అన్నమయ్య జిల్లా
📅 తేదీ: 08-10-2026
📍 జిల్లా : అన్నమయ్య
🏢 సబ్ డివిజన్ : మదనపల్లి
👮 పోలీస్ స్టేషన్ : మదనపల్లి 1 టౌన్
📌 స్థలం : NVR స్ట్రీట్, మోతీ నగర్, మదనపల్లి
🚨 ఆపరేషన్ గరుడ – ఆకస్మిక తనిఖీలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు EAGLE సెల్ మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా మదనపల్లి పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహ మెడికల్ షాప్ మరియు శ్రీ సాయి ప్రథమ చికిత్స కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
🔍 తనిఖీల సందర్భంగా NRx మందులు మరియు మత్తు ప్రభావం కలిగించే Tramadol, Alprazolam, Clonazepam, Ultra Cet, Spasmo Proxyvon Plus తదితర ఔషధాల కొనుగోలు, నిల్వ మరియు విక్రయాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
💊 వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా NRx మందులను విక్రయించరాదని, వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు మాత్రమే మందులను విక్రయించి, సంబంధిత రిజిస్టర్లలో తప్పనిసరిగా నమోదు చేయాలని డ్రగ్ ఇన్స్పెక్టర్ సూచించారు.
📋 అదేవిధంగా మెడికల్ షాపుల లైసెన్సులు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు మరియు ఇతర సంబంధిత రికార్డులను పరిశీలించి, Drugs and Cosmetics Act నిబంధనలపై షాప్ నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
👮♂️ ఈ తనిఖీలలో మదనపల్లి డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీ కలందర్ గారు, EAGLE సెల్ ప్రతినిధులు మరియు మెడికల్ షాప్ సిబ్బంది పాల్గొన్నారు.