EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Garuda
Impact Operations
OFFICIAL

Operation Garuda

Date: 14 October, 2026 Guntur - East Sub Division - Kothapet
🦅 ఈగల్ సెల్ గుంటూరు🦅

📅 14.10.2026

🚨విషయం: *ఆపరేషన్ గరుడ లో భాగంగా గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఈగల్ సెల్ మరియు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా మెడికల్ షాపుల తనిఖీలు నిర్వహించడం అయినది

➡️ గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో 14.10.2026వ తేదీన గుంటూరు ఈగల్ సెల్ మరియు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, గుంటూరు అధికారులు సంయుక్తంగా గుంటూరు జిల్లా, గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట మెడికల్ షాపులను తనిఖీ చేయడం జరిగింది.

➡️ ఈ తనిఖీలలో భాగంగా మెడికల్ షాపులలో నిర్వహిస్తున్న పర్చేజ్ రిజిస్టర్లు, ఎన్‌ఆర్‌ఎక్స్ (NRx) రిజిస్టర్లను పరిశీలించి, ఔషధాల కొనుగోళ్లు, విక్రయాలకు సంబంధించిన వివరాలను నిబంధనల ప్రకారం సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అనే అంశాలను తనిఖీ చేయడం జరిగింది.

➡️ మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఔషధాల విక్రయాలపై పర్యవేక్షణ పెంచడం మరియు సంబంధిత నిబంధనలను అమలు చేయడం లక్ష్యంగా ఈ సంయుక్త తనిఖీలు నిర్వహించబడ్డాయి.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.