అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు పట్టణం లో వివిధ మెడికల్ షాపులలో డిస్ట్రిక్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి కళ్యాణి గారు, ఈగల్ టీం సభ్యులు అలాగే పాడేరు పోలీసుల సమన్వయంతో సంయుక్తంగా పట్టణం లో *4*మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.
ఈ తనిఖీలు ప్రధానంగా నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ నిల్వలు, విక్రయాలు, వాటికి సంబంధించిన రికార్డుల నిర్వహణను పరిశీలించేందుకు నిర్వహించబడ్డాయి.
ప్రచార కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి మార్గదర్శకాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంపై ప్రత్యేకంగా కఠినమైన తనిఖీల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి యువతను మరియు సమాజాన్ని రక్షించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం.
కఠిన హెచ్చరికలు మరియు చట్టపరమైన చర్యలు
తనిఖీల సందర్భంగా మెడికల్ షాపుల నిర్వాహకులందరూ ఔషధాల విక్రయాలు, నిల్వలు మరియు రికార్డుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తనిఖీల సమయంలో ఏదైనా మెడికల్ షాపులో సరైన డాక్యుమెంటేషన్, రికార్డులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్లు లేదా చెల్లుబాటు అయ్యే లైసెన్సులు లేనట్లు గుర్తిస్తే, నిబంధనలకు అనుగుణంగా ఆ షాపు లైసెన్సును తక్షణమే రద్దు చేసే చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
అంతేకాకుండా, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారంలో పాల్గొనే వ్యక్తులు లేదా సంస్థలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక తనిఖీల కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు.