EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 05 October, 2026
100%
EAGLE
› Enforcement › OPERATION EAGLE ON TRAINNS - ఈగల్, తిరుపతి పోలీస్ &amp రైల్వే పోలీసుల సంయుక్త తనిఖీలు
Impact Operations
OFFICIAL

OPERATION EAGLE ON TRAINNS - ఈగల్, తిరుపతి పోలీస్ &amp రైల్వే పోలీసుల సంయుక్త తనిఖీలు

Operation EAGLE on Trains · Operation Details

Date: 05 October, 2026
YSR KADAPA
Tirupati SDPO
Tirupathi East UPS

OPERATION EAGLE ON TRAINNS - ఈగల్, తిరుపతి పోలీస్ &amp రైల్వే పోలీసుల సంయుక్త తనిఖీలు

Operation EAGLE on Trains
Operation Details
Date of Operation
05 October, 2026
District
YSR KADAPA
Sub-Division
Tirupati SDPO
Police Station
Tirupathi East UPS
GRP Unit
GRP Guntakal
Detailed Description
తిరుపతి జిల్లా
తేదీ: 05-10-2026
ఈగల్, తిరుపతి పోలీస్ &amp రైల్వే పోలీసుల సంయుక్త తనిఖీలు
డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, నిల్వ మరియు సరఫరాను అరికట్టే చర్యల్లో భాగంగా, తిరుపతి నగరంలో EAGLE Organization, తిరుపతి పోలీసులు మరియు రైల్వే పోలీసులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ రోజు ఉదయం 06:00 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ కార్యక్రమం చేపట్టారు. రైల్వే స్టేషన్‌లోని పార్సెల్ కౌంటర్లు, క్లాక్ రూమ్స్, ప్లాట్‌ఫార్మ్‌లు మరియు అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం గంజాయి, మత్తు పదార్థాలు మరియు ఇతర నిషేధిత డ్రగ్స్ రవాణా లేదా అక్రమంగా తరలించే ప్రయత్నాలను గుర్తించడం మరియు అడ్డుకోవడం.
ఈ సంయుక్త తనిఖీలలో:
EAGLE CI ప్రసాద్
Enforcement CI నాగార్జున రెడ్డి
EAGLE సిబ్బంది
తిరుపతి స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది
రైల్వే పోలీసు సిబ్బంది
డాగ్ స్క్వాడ్
వీడియో గ్రాఫర్
పాల్గొన్నారు.
అనంతరం APSRTC పార్సెల్ కౌంటర్, క్లాక్ రూమ్స్ మరియు ప్లాట్‌ఫార్మ్ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా తనిఖీలు నిర్వహించారు. పార్సెల్‌లలో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా, నిషేధిత మత్తు పదార్థాలను పార్సెల్‌ల ద్వారా రవాణా చేస్తున్నారా అనే అంశాలపై ప్రత్యేకంగా పరిశీలించారు.

డాగ్ స్క్వాడ్ సహాయంతో అనుమానాస్పద ప్రాంతాలు, పార్సెల్ కౌంటర్లు మరియు ఇతర ముఖ్య ప్రదేశాలను తనిఖీ చేశారు.

ఈ సంయుక్త తనిఖీల సందర్భంగా గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి విశేషాలు/అనుమానాస్పద వస్తువులు గుర్తించబడలేదు.

డ్రగ్స్ అక్రమ రవాణాపై నిఘాను మరింత పటిష్టం చేయడంలో భాగంగా రైల్వే స్టేషన్, APSRTC పార్సెల్ కేంద్రాలు మరియు రవాణా కేంద్రాల వద్ద ఇలాంటి సంయుక్త తనిఖీలను నిరంతరం కొనసాగించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

“డ్రగ్స్ రవాణాకు తిరుపతి జిల్లాలో ఎలాంటి అవకాశం లేకుండా, రవాణా మార్గాలు మరియు ముఖ్యమైన ట్రాన్సిట్ పాయింట్లపై నిరంతరం నిఘా కొనసాగుతుంది.

ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించండి. త్రిసూల్ కార్యక్రమం ద్వారా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.”
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.