నంద్యాల ఈగల్ సెల్
ఆపరేషన్ త్రిశూల్ - ఆపరేషన్ గరుడ
గౌరవ ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఐజిపి శ్రీ ఆకే రవి కృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
నంద్యాల జిల్లా ప్యాపిలిలో
ఆపరేషన్ త్రిశూల్- ఆపరేషన్ గరుడ లో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ జయరాం గారు, హనుమన్న గారు మరియు నంద్యాల ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్యాపిలి టౌన్ లోని 6 మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా H1 రిజిస్టర్ తనిఖీ, NRx మందుల అమ్మకాలు, కొనుగోలు యొక్క బిల్లును పరిశీలించడం, బిల్లు బుక్కులు, Expired మందులు వంటివి చెక్ చేసి సంబంధిత మెడికల్ షాపు సిబ్బందికి H1 రిజిస్టర్, stock book, bill book, CC cameras ఏర్పాటు చేసుకోవాలని, పిల్లలకు NRx మందులు అమ్మరాదని, ఎవరైనా మత్తు మాత్రలు అడిగితే ఇవ్వరాదని డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరాదని తెలిపారు.