EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › De-Addiction Centre Visits
De-Addiction
OFFICIAL

De-Addiction Centre Visits

Date: 15 October, 2026 Eluru
ఏలూరు ఈగల్ సేల్
తేదీ: 15-10-2026
EAGLE CELL ELURU – VISIT TO DE-ADDICTION CENTRE, GGH ELURU.
👉ఏలూరు జిల్లా EAGLE Cell సిబ్బంది ఏలూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) నందు గల డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి, వారికి అందిస్తున్న చికిత్స వివరాలు మరియు వారి పురోగతి గురించి పేషెంట్లను, వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగినది.
👉అనంతరం, పేషెంట్లకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించి, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగిస్తూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని సూచించడం జరిగినది.
👉అలాగే, అక్కడ శిక్షణ పొందుతున్న నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి, EAGLE విభాగం యొక్క విధులు, బాధ్యతలు మరియు మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత మరియు వైద్య సిబ్బంది పోషించాల్సిన పాత్ర గురించి వివరించడం జరిగినది.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు EAGLE టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1972 కు సమాచారం అందించాలని సూచించడం జరిగినది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.