EAGLE CELL – Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా
విషయం: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా “BREAK THE SILENCE” అవగాహన కార్యక్రమం నిర్వహణ – నివేదిక.
తేదీ: 10-10-2026
సబ్ డివిజన్: అమలాపురం
Place: Amalapuram Town PS
స్థలం: ఏరియా హాస్పిటల్, అమలాపురం, డి-అడిక్షన్ సెంటర్.
గౌరవనీయులైన ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ, IPS గారు, శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS, SP గారు మరియు శ్రీమతి D. స్వరూప రాణి, SP, EAGLE గారి ఆదేశాల మేరకు, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా EAGLE CELL, Dr. B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో అమలాపురం ఏరియా హాస్పిటల్‌లోని డి-అడిక్షన్ సెంటర్‌లో “BREAK THE SILENCE” (మౌనం వీడండి) అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు, ఆసుపత్రి నర్సులు, డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది మరియు చికిత్స పొందుతున్న వ్యక్తులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, వ్యసన విముక్తి మరియు బాధితులకు అందించాల్సిన సహకారంపై అవగాహన కల్పించారు.
ముఖ్యంగా, తొలిసారిగా మాదకద్రవ్యాలను వినియోగించి వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స పొందుతున్న వారిని నేరస్తులుగా లేదా చిన్నచూపు చూసే వ్యక్తులుగా కాకుండా, సరైన మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల సహకారం మరియు వైద్య చికిత్స ద్వారా సాధారణ జీవితంలోకి తిరిగి తీసుకురావాల్సిన వ్యక్తులుగా చూడాలని సూచించారు. వారిపట్ల సానుభూతి, గౌరవం చూపిస్తూ, మానసిక ధైర్యాన్ని అందించి, వ్యసన విముక్తి దిశగా ప్రోత్సహించాలని తెలియజేశారు.
🗣️ BREAK THE SILENCE – మౌనం వీడండి
మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా, బాధ్యతగల పౌరులుగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే, యువతలో ఎవరైనా మాదకద్రవ్యాల వ్యసనానికి గురవుతున్నట్లు గమనిస్తే వారిని నిర్లక్ష్యం చేయకుండా, సకాలంలో కౌన్సెలింగ్, వైద్య సహాయం మరియు సరైన మార్గదర్శకత్వం అందేలా సహకరించాలని పిలుపునిచ్చారు.
🛡️ EAGLE ప్రత్యేక కార్యక్రమాలు
రాష్ట్రవ్యాప్తంగా EAGLE విభాగం చేపడుతున్న చైతన్యం, గరుడ, సేఫ్ క్యాంపస్ జోన్, జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్, వజ్రప్రహార్ తదితర కార్యక్రమాల గురించి వివరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, యువతలో చైతన్యం మరియు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములై వికసిత భారత్ లక్ష్య సాధనకు తమ వంతు కృషి చేయాలని సందేశాన్ని అందించారు.
📞 EAGLE టోల్ ఫ్రీ నంబర్ – 1972
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే EAGLE టోల్ ఫ్రీ నంబర్ 1972 కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు.
👥 కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో EAGLE CI శ్రీ వెంకటేశ్వరరావు గారు మరియు సిబ్బంది, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. సుమలత గారు, సైకియాట్రిస్ట్ డా. సౌమ్య గారు, ఆసుపత్రి మరియు డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది పాల్గొని మాదకద్రవ్యాల నిర్మూలన, మానసిక ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యసన విముక్తి పట్ల అవగాహన పొందారు.