EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Garuda
Impact Operations
OFFICIAL

Operation Garuda

Date: 09 October, 2026 Parvathipuram Manyam - Parvathipuram SDPO - Parvathipuram Town
రవ EAGLE IGP శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, EAGLE SP (Ops) శ్రీ M. మహేశ్వర్ రాజు, IPS, EAGLE SP (Admin) శ్రీమతి M. స్వరూపారాణి గారి ఆదేశాల మేరకు, ఆపరేషన్ గరుడ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం పట్టణంలో మెడికల్ షాపుల తనిఖీలు నిర్వహించారు.

పార్వతీపురం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ N. యుగంధర్ గారి ఆధ్వర్యంలో EAGLE బృందం, పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ASI B.R. వెంకటేశ్వరరావుతో కలిసి, శ్రీ కర్షక మహర్షి ఫార్మసీ &amp హాస్పిటల్ మరియు జై శ్రీ హాస్పిటల్‌లోని నాగావళి మెడికల్ షాప్‌లను తనిఖీ చేసింది.

ఈ తనిఖీల్లో మెడికల్ షాపుల్లోని NRX ఔషధాలు, వాటికి సంబంధించిన కొనుగోలు (Purchase), విక్రయ (Sales) రికార్డులు మరియు ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు.

అనంతరం, మెడికల్ షాపుల యాజమాన్యాలకు మాదకద్రవ్యాల నియంత్రణ, NRX ఔషధాల నిర్వహణలో నిబంధనల పాటింపు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల అక్రమ వినియోగం, దుర్వినియోగాన్ని అరికట్టడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

PVP మన్యం జిల్లా EAGLE సెల్
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.