🦅 ఏపీ ఈగల్ రాజమహేంద్రవరం
బ్రేక్ ది సైలెన్స్ – ఈగల్ 1972కు కాల్ చేయండి
🚨 నలుగురికి డీ-అడిక్షన్ చికిత్స అందేలా ఈగల్ సహకారం
📅 తేదీ: 23-10-2026
ఈగల్ హెల్ప్‌లైన్ 1972 ద్వారా అందిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం ఈగల్ బృందం సంబంధిత ప్రదేశంలో తనిఖీలు నిర్వహించింది. అక్కడ ఉన్న నలుగురికి రాపిడ్ డ్రగ్ టెస్టులు నిర్వహించగా, నలుగురికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
🤝 వ్యసనం నుంచి కోలుకునేందుకు మరో అడుగు
ఈరోజు బాధితుల తల్లిదండ్రుల సమక్షంలో నలుగురినీ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని డీ-అడిక్షన్ కేంద్రంలో ఔట్ పేషెంట్లుగా (OP) చేర్పించడం జరిగింది. వారు మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడి, ఆరోగ్యకరమైన సాధారణ జీవన విధానంలోకి తిరిగి రావాలనే లక్ష్యంతో జీజీహెచ్ వైద్యులు కౌన్సెలింగ్ అందించారు.
💙 మాదకద్రవ్యాల సమస్యతో బాధపడుతున్న వారికి కుటుంబ సభ్యులు అండగా నిలిచి, నిపుణుల కౌన్సెలింగ్ మరియు డీ-అడిక్షన్ సేవలు పొందేలా సహకరించాలి.
📞 బ్రేక్ ది సైలెన్స్ – ఈగల్ 1972కు కాల్ చేయండి
డ్రగ్స్ వద్దు బ్రో – జీవితం ముద్దు బ్రో!