లోకల్ పోలీస్ సిబ్బంది తో కలిసి ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ డివిజన్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెళ్లూరు జంక్షన్ దగ్గర ఈగల్ టీం మత్తు మాదక ద్రవ్యాల గురించి వెహికల్ చెకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడం, విక్రయించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో తనిఖీలు చేపట్టారు.
ఈగల్ టీమ్ మరియు స్థానిక పోలీసు సిబ్బంది పరస్పర సమన్వయంతో తనిఖీలను నిర్వహించి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణకు అవసరమైన చర్యలపై దృష్టి సారించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం మరియు మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశ్యం.
ఈగల్ టీమ్ 1972 టోల్ ఫ్రీ నంబర్కు మాదకద్రవ్యాల సమాచారం అందించాలి అని ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది.