EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Operation Garuda
Impact Operations
OFFICIAL

Operation Garuda

Date: 12 October, 2026 Anakapalli - Anakapalli SDPO - Anakapalli Town
OPERATION GARUDA💥

💊 మెడికల్ షాపులపై EAGLE, NCB మరియు డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సంయుక్త తనిఖీలు.

Place: అనకాపల్లి జిల్లా, అనకాపల్లి టౌన్ PS, అనకాపల్లి sub division

గౌరవ EAGLE IGP శ్రీ A.K. రవికృష్ణ, IPS గారు, గౌరవ SP (OPS) శ్రీ K.M. మహేశ్వరరాజు, IPS గారు, గౌరవ SP, EAGLE శ్రీమతి D. స్వరూపరాణి, IPS మేడమ్ గారు మరియు గౌరవ EAGLE అదనపు ఎస్పీ శ్రీ Ch. శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు,

ఈరోజు ఆపరేషన్ గరుడలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని మెడికల్ షాపులపై అనకాపల్లి EAGLE టీమ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు మరియు డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఈ తనిఖీలలో భాగంగా NRx (నార్కోటిక్ మరియు సైకోట్రోపిక్ ఔషధాలు) విక్రయాలు, నిల్వలు, కొనుగోలు వివరాలు, వైద్యుల ప్రిస్క్రిప్షన్లు మరియు సంబంధిత రికార్డులను పరిశీలించడం జరిగింది.

అలాగే NRx ఔషధాల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, వైద్యుల చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ లేకుండా సంబంధిత ఔషధాలను విక్రయించరాదని మెడికల్ షాపుల నిర్వాహకులకు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డ్రాగ్ ఇన్స్పెక్టర్ భారతి మేడమ్, NCB ఇన్స్పెక్టర్ కిరణ్ బాబు, అనకాపల్లి ఈగల్ టీమ్ మరియు NCB &amp డ్రగ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.