తేదీ :28.10.2026
జిల్లా : విజయనగరం
సబ్ డివిజన్ :విజయనగరం
వేదిక : RTC Complex
బ్రేక్ ది సైలెన్స్ – కాల్ ఈగల్ 1972 ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తేదీ 28.10.2026 నాడు
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే లక్ష్యంతో విజయనగరం RTC కాంప్లెక్స్ పరిధిలోని పార్సెల్ సర్వీస్ కేంద్రాలను ఈగల్ టీమ్ మరియు స్థానిక పోలీసు సిబ్బంది సందర్శించడం జరిగింది
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పార్సెల్‌లపై ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించడం.
సరైన మొబైల్ నంబర్, పూర్తి చిరునామా ఇవ్వకుండా బుక్ చేసిన పార్సెల్‌ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలియజేయడం.
పంపినవారు, స్వీకరించేవారి వివరాలు అసంపూర్తిగా ఉన్న పార్సెల్‌లను గుర్తించి, అనుమానం ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని సూచించడం.
పార్సెల్ సర్వీస్ నిర్వాహకులకు అనుమానాస్పద పార్సెల్‌లను గుర్తించడం, వాటి బుకింగ్ వివరాలు, పంపినవారు మరియు స్వీకరించేవారి వివరాలను పరిశీలించడం గురించి అవగాహన కల్పించడం .
అనుమానాస్పద పార్సెల్‌లు గుర్తించినప్పుడు వాటిని స్వయంగా తెరవకుండా, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించడం జరిగింది
మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణలో ప్రజలు, పార్సెల్ సర్వీస్ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరడం జరిగింది.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినప్పుడు EAGLE ఆంధ్రప్రదేశ్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని అవగాహన కల్పించడం.