EAGLE CELL – అనంతపురం జిల్లా
విషయం: డ్రోన్ నిఘా (Drone Surveillance) నిర్వహణ – నివేదిక.
ఈ రోజు అనంతపురం జిల్లా, అనంతపురం రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈగల్ సెల్ బృందం మరియు ఆత్మకూర్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా నిఘా నిర్వహించడం జరిగింది.
ఈ నిఘాలో భాగంగా సంబంధిత ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, అనుమానాస్పద కార్యకలాపాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించడం జరిగింది.
ఈ తనిఖీలలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గుర్తించబడలేదు . అయినప్పటికీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో నిరంతర నిఘా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నియంత్రణ మరియు అక్రమ కార్యకలాపాల నివారణలో భాగంగా ఈగల్ బృందం మరియు లోకల్ పోలీస్ సహకారం తో పర్యవేక్షణ కొనసాగిస్తుంది.