EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Hotspots Visits
Field Verification & Monitoring
OFFICIAL

Hotspots Visits

Date: 12 October, 2026 Guntur - East Sub Division - Old guntur
🚨విషయం: ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గంజాయి వినియోగ హాట్‌స్పాట్‌లపై తనిఖీలు – నలుగురికి THC స్క్రీనింగ్‌లో పాజిటివ్

➡️గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పాత గుంటూరు పోలీస్ స్టేషన్ నందు క్రిస్టియన్ సమాధుల తోట ఆనందపేట
గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ నగరం పాలెం పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణ బాబు కాలనీ నందు

➡️ గౌరవనీయులైన ఈగల్ ఐజీపీ శ్రీ ఆకె రవికృష్ణ, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ఈగల్ ఎస్పీ ఆపరేషన్స్ శ్రీ మహేశ్వర రాజు, ఐపీఎస్ గారి సూచనలతో, 12.10.2026న గుంటూరు ఈస్ట్, వెస్ట్ సబ్ డివిజన్ల పరిధిలోని కొండా వెంకటప్పయ్య కాలనీ, ఆనందపేట క్రిస్టియన్ సమాధుల తోట ప్రాంతాల్లో ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా గుంటూరు ఈగల్ సెల్ బృందం స్థానిక పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించడం అయినది.

➡️ కొండా వెంకటప్పయ్య కాలనీలో గంజాయి వినియోగానికి సంబంధించిన ఆనవాళ్లు, పొగాకు కలిపిన పదార్థాలు, బాంగ్ బాటిళ్లు గుర్తించబడ్డాయి. ఆనందపేట క్రిస్టియన్ సమాధుల తోట వద్ద గంజాయి సేవిస్తున్న నలుగురిని గుర్తించి నిర్వహించిన THC స్క్రీనింగ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో తదుపరి చర్యల నిమిత్తం పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కి తదుపరి చర్యల కోసం తరలించడం అయినది
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.