EAGLE

Government of Andhra Pradesh
| Last Updated: 21 November, 2026
100%
EAGLE
Home › Enforcement › Rehabilitation
De-Addiction
OFFICIAL

Rehabilitation

Date: 19 October, 2026 Eluru
ఏలూరు ఈగల్ సెల్
తేదీ: 19-10-2026
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి
డి-అడిక్షన్ సెంటర్: GGH, ఏలూరు
సబ్ డివిజన్: ఏలూరు

విషయం : ఏలూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లోని డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించి, చికిత్స మరియు పునరావాసం నిమిత్తం జాయిన్ చేయించడమైనది

EAGLE CELL ELURU – 1972 HELPLINE VERIFICATION – 3 PERSONS TESTED POSITIVE AND ADMITTED TO DE-ADDICTION CENTRE.
* 1972 హెల్ప్‌లైన్ ద్వారా అందిన సమాచారం మేరకు ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పు వీధి, చాటపర్రు రోడ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడమైనది.
* ఏలూరు రూరల్ ఎస్‌ఐ గారు సిబ్బందితో కలిసి సంబంధిత ప్రాంతాన్ని సందర్శించగా, ఏలూరు ఈగల్ సెల్ సిబ్బంది సమన్వయంతో అనుమానాస్పద వ్యక్తులకు THC డ్రగ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించడమైనది.
* మొత్తం నలుగురు వ్యక్తులకు డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ముగ్గురు వ్యక్తులకు గంజాయి వినియోగాన్ని గుర్తించే THC పరీక్షలో పాజిటివ్ వచ్చినది.
* పాజిటివ్ వచ్చిన ముగ్గురు వ్యక్తులకు అవసరమైన కౌన్సెలింగ్, పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో ఏలూరు రూరల్ పోలీసుల సమన్వయంతో ఏలూరు ఈగల్ సెల్ సిబ్బంది వారిని ఏలూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లోని డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించి, చికిత్స మరియు పునరావాసం నిమిత్తం జాయిన్ చేయించడమైనది.
* మాదకద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ, సంబంధిత వ్యక్తులు సాధారణ జీవనంలోకి తిరిగి రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా చర్యలు చేపట్టడమైనది.
Other Enforcements
Together, we can build a drug-free Andhra Pradesh. Be the change.
© 2026 Eagle Narcotics, Government of Andhra Pradesh. All Rights Reserved.