EAGLE, EAST GODAVARI DISTRICT.
Dt. 17-10-2026. Rajamahendravaram
* BREAK THE SILENCE
✅ గౌరవ IGP శ్రీ ఆకే రవి కృష్ణ, IPS, IGP
EAGLE వారు
ఈరోజు ధవళేశ్వరం లో ఉన్న పుష్కరమాత డి - అడిక్షన్ సెంటర్ ను సందర్శించి, సెంటర్ సిబ్బంది తో మాట్లాడి, అక్కడయున్న సదుపాయాలను, అచట చేరే రోగులకు ఇచ్చే చికిత్స గురించి మరియు సదుపాయాల గురించి తెలుసుకునియున్నారు.
✅మరియు అచటయున్న రోగులతో గౌరవ IGP వారు సమావేశమయ్యి, వారు మత్తుకు బానిస అవడానికి గల కారణాలను తెలుసుకుని, వారికి మంచి గా పరిణితి చెంది మారిన మనుషులుగా సెంటర్ ను వీడాలని తెలిపినారు..
✅అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని పునర్జన్మ గా భావించి , సరైన ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకుని మారిన మనిషి గా మత్తును వదిలి పరివర్తన చెంది సెంటర్ ను వీడాలని కోరడమైనది..
✅IGP సార్ కొంతమంది రోగులతో ప్రత్యేకంగా వారితో చెస్ ఆట ఆడి వారిని ఉత్తేజ పరిచినారు..
మత్తు కు అలవాటు పడిన వారు వాటి నుండి దూరం జరిగేందుకు క్రీడలపై దృష్టి పెట్టాలని తెలిపినారు.
✅ అదేవిధంగా గౌరవ ఐజిపి వారు అచట ఉన్న సిబ్బందికి మరియు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా మౌనాన్ని వీడి వారి ప్రాంతంలో ఎటువంటి మత్తు పదార్థాలకు సంబంధించిన కార్యకలాపాలు జరిగినా ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వమని బ్రేక్ ది సైలెన్స్ క్యాంపెయిన్ గురించి వివరించారు..